Friday, 26 September 2014


చిత్రం : నిన్నే ప్రేమిస్తా


ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు

పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటే చేరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై ఉంటె అంత సంబరం

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు

ఏటిలో తరగల్లె ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతుంది
కంటికే కునుకంటూ రానుపోమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసములో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు


Posted By: Rajkumar Arsam

Monday, 19 May 2014

Kalyanam Kamaneeyam song Lyrics

 చిత్రం: స్వాతి
మ్యూజిక్ : చక్రవర్తి
ప్లేబాక్ : ఎస్ .పి  శైలజ  ,పి . సుశీల



కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
 కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం

అమ్మను వధువుగా చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం  ఈ పాపలకేంతో ఆనందం
                                                     
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం

ఆ వేదమంత్రాల అర్థాలు తెలిసి ఆశీర్వదించండి ఈ జంటని
ఆ పుష్య రాగాల ఆంతర్యమెరిగి దీవించి పంపండి ఈ ఇంటికి

మనసుపడే సౌభాగ్యం మమత అనే మాంగల్యం
స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా -2
శివ పార్వతులు మాకు మీరే కదా -2
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం                                 

ముక్కోటి దేవుళ్ళ ముధ్దంత తెచ్చిముగ్గెసు కోవాలి ఈ ఇంటికి

శతకోటి తారల్ల చిరునవ్వు తెచ్చి హారాలు వేయాలి ఈ జంటకి
సగమైన సహధర్మం కలిసిందే సంసారం

ఏడేడు జన్మాల భంధాలతో -2
మీ జన్మ పండాలి అనురాగమై - 2
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం                                   
అమ్మను వధువుగా చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం  ఈ పాపలకేంతో ఆనందం