Friday, 26 September 2014


చిత్రం : నిన్నే ప్రేమిస్తా


ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు

పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటే చేరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై ఉంటె అంత సంబరం

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు

ఏటిలో తరగల్లె ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతుంది
కంటికే కునుకంటూ రానుపోమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసములో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా  ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మనీ కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు


Posted By: Rajkumar Arsam

No comments:

Post a Comment